ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 3:35 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.     

         సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.                                                    

అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు.12      

                                                             వేగంగా వచ్చిన ట్యాంకర్ ను ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు.  ఆదే సమయంలో అదే హైవేపై వరుసగా మూడు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. . మరో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది.  వారిని చికిత్స కోసం  ఆస్పత్రికి తరలించారు. రెండు రోడ్డుప్రమాదాల్లో మొత్తం 9 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆటలో 14 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామ సమీపంలో ఘటన జరిగింది.
ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి. దిగ్భ్రాంతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.